Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాజరైన మంత్రి, మేయర్, పలువురు కార్పొరేటర్లు
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
కార్పొరేటర్ పల్లా రోజ్లీనా ఇంట్లో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజరుకుమార్తో పాలు మేయర్, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు.అతిథులకు కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా భర్త పల్లా సల్మాన్ రాజ్ బొకేలు ఇచ్చి ఆహ్వానించారు. వారి కుమారుడైన పల్లా జాన్ అబ్రహం శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా మాట్లాడుతూ తమ ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చిన మంత్రికి, కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర్, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కమర్తపు మురళి, ప్రశాంతి లక్ష్మి, దోరపల్లి శ్వేత, పాకాలపాటి విజయ నిర్మల, ఆళ్ల నిరోషా, మరికొంతమంది కార్పొరేటర్లు పాల్గొన్నారు,