Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
ఓ డిగ్రీ విద్యార్థి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన చిన్న బీరవల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన గుజ్జు రాజేంద్రప్రసాద్, సునీత దంపతుల కుమారుడైన గుజ్జు రాకేష్ (21) మధిరలోని ఓ కాలేజీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అయితే రాకేష్ గత వారం రోజులుగా తాను చనిపోతానని కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో అంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా కుటుంబ సభ్యులతో తాను చనిపోతానని అన్నట్టు తెలిసింది. ప్రతి రోజులాగే శుక్రవారం రాత్రి కూడా తన ఇంట్లో ఓ గదిలో ఒంటరిగా పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులు క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చికి వెళ్లేందుకు కుమారుడిని లేపే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు పిలిచినా రాకేష్ పలకకపోవడంతో కిటికీలోనుంచి చూడగా రాకేష్ ఫ్యాన్‌కి ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే తల్లిదండ్రులు తలుపులు తీసి కిందకి దింపారు. అప్పటికె రాకేష్ మృతి చెంది ఉన్నాడు. రాకేష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తల్లిదండ్రులకు కూడా అంతుపట్టడం లేదు.