Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
అన్యాయానికి ప్రతీక అయిన మనుస్మృతిని వ్యతిరేకిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఖమ్మం2వ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మనుస్మతి పత్రాలను శనివారం ఖమ్మంలోని రమణ గుట్ట ప్రాంతంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ దహనం చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ మనువాదంపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కెవిపిఎస్ 2వ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు నకరికంటి చిరంజీవి, బొట్ల సాగర్, 57వ డివిజన్ కార్యదర్శి గుమ్మడి భిక్షం, నాయకులు నారపోగు నాగేశ్వరరావు, గుమ్మడి నర్సయ్య, మొగిలి విజయ, కుమారి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.