Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
మండల కేంద్రంలోని కేశవాపురం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు శనివారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొమ్ము శ్రీను మాట్లాడుతూ పోరాటాలకు నిలయమైన తిరుమలాయపాలెం మండలంలో సీపీఐ(ఎం) వైపు యువత అడుగులు వేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మండలంలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడుతామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఐ(ఎం)కు ప్రజల అండదండలు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు అంగిరేకుల నర్సయ్య, పద్మనాభుల సుధాకర్, వేగినాటి వెంకట్రావు, బింగి రమేష్, మండల కమిటీ సభ్యులు రేపాకుల వెంకన్న, నాయకులు రామనబోయిన రవి, చొంటి వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్ ఉన్నారు.