Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పంట నష్టం అంచనాలు వేసి
అ రైతులకు పరిహారం చెల్లించాలి
అ రైతు సంఘం రాష్ట్ర నాయకులు
కాసాని ఐలయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు లక్షలాది ఎకరాల మిర్చిని సాగు చేస్తే వైరస్ సోకి పంటలు నాశనం అవుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య ఆరోపించారు. శనివారం తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి బృందం మండలంలోని గంగోలు, తూరుబాక గ్రామాల్లో సర్యటించి వైరస్ సోకిన మిర్చి పంటలను వారు పరీశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మిర్చి తోటలకు తామర, నల్లనల్లి, ఎర్రనల్లి, వైరస్ సోకితే రైతులు 40 నుండి 60 సార్లు మందులు పిచికారి చేసినప్పటికీ తెగుళ్లుతగ్గడం లేదన్నారు. మిర్చి పంటకి ఎకరానికి రైతులు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని చేతికి వచ్చిన పంట బుగ్గిపాలు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోగ పోగా చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆద్వర్యంలో మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 27 వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వైరస్ తో నష్ట పోయిన రైతులు వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలన్నారు. మిర్చి తోటలను పరీశీలించిన వారిలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అద్యక్ష కార్యదర్శులు యలమంచి రవికుమార్, కున్సోత్ ధర్మా, జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, దుమ్ముగూడెం పిఏసిఎస్ అద్యక్షులు కిలిమి ఎల్లారెడ్డి, మండల కార్యదర్శి బొల్లి సూర్యచందర్రావు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్. మురళి, నాయకులు గుడ్ల రామ్మోహన్రెడ్డి, కాక కృష్ణ, దన్నిన నర్సింహారావు, కల్లూరి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.