Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి అజరు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రులకు సమయం ఇవ్వని బీజేపీ పెద్దలు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. బండి సంజరు ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ మాట తప్పినందుకా? అని ఎద్దేవా చేశారు. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సంయమనంతో ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తాతా మధుసూదన్‌రావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా, ఖమ్మం ఏఎంసీ చైర్మన్లు బచ్చు విజరు కుమార్, లక్ష్మీప్రసన్న, పార్టీ కార్యాలయ ఇన్ చార్జి ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.