Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర నేత కాసాని డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో బీజేపీ, దానికి అండగా నిలబడుతున్న హిందూత్వ సంస్థలు మత విద్వేషానికి తెరలేపుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలపై యుద్ధానికి సిద్ధం కావాలంటూ మెజార్టీ హిందూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, ఆయుధాలు చేపట్టి మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలను తరిమికొట్టినట్టు భారత్‌లో ముస్లింలపై దాడులకు తెగబడాలని హిందూత్వ సంస్థల ప్రతి నిధులు పిలుపు నిస్తున్నారన్నారు. కొద్దిరోజుల క్రితం న్యూఢిల్లీ, హరి ద్వార్‌లో హిందూత్వ సంస్థలు నిర్వహించిన సభలకు బీజేపీ నాయకులు హాజరై మతవిద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఆయుధాలతో దాడులు జరపాలని పిలపునివ్వడం దేశంలో అంతర్గత యుద్ధానికి తెరలేపడమే అని ఆయన విమర్శించారు. కేంద్రంలో మోడీ సర్కార్ అండదండలతోనే హిందూ త్వ సంస్థలు రెచ్చిపోతున్నాయని అన్నారు. భారత్‌ను హిందూత్వ దేశంగా ఏర్పాటు చేయటం కోసం చంపటమో చావటమో దేనికైనా సిద్ధం కావాలి'' అంటూ హిందూ యువ వాహినీ కార్యకర్తలతో ప్రమాణం చేయించడం మత ఉన్మాదాన్ని నూరిపోయడం అని ఆయన విమర్శించారు. హరిద్వార్‌లో నిర్వహించిన 'ధర్మసంసద్'లో వక్తలు మత విద్వేషాన్ని వెళ్లగక్కారని ఆరోపించారు. విద్వేష ప్రసంగాలు చేసినవారిని వెంటనే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.