Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు మనుస్మృతి వ్యతిరేక సంఘాల ఆధ్వర్యంలో శనివారం మనుస్మృతి దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నేత డాక్టర్ భాను ప్రసాద్, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ముద్ద పిచ్చయ్య, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్, దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా ఆర్గనైజర్ నడిపింటి మధు మహారాజు, భోజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపకులు ఏవి రావు, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు, భోజన సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు కోగిల్ల గాంధీ పాల్గొని మాట్లాడారు. భారతదేశ పీడిత ప్రజలకు ఒక ''విమోచనా దినోత్సవం అని, ధర్మం పేరుతో కొనసాగుతున్న ఒక అనాగరికమైన వివక్షాపూరిత సమాజాన్ని ధ్వంసం చేసి, ఒక స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావం పరిమళించే ఒక నవ నాగరిక సమాజాన్ని నిర్మించేందుకు పునాదులు వేసిన రోజు అని వారు పేర్కొన్నారు. ఈ నీచమైన వ్యవస్థకు ముఖ్య కారణం ధర్మం పేరుతో కొనసాగించ బడుతున్న మనువు ఆటవిక ధర్మశాస్త్రం అంటూ బాబాసాహెబ్ డిసెంబర్ 25న మనుస్మృతి దహనానికి పిలుపునిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇసంపల్లి ముత్యం, ముద్దా రోహిత్, సోమక నరేష్ కుమార్, జిల్లా ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మనుస్మృతి ప్రతులు దహనం
మణుగూరు : మణుగూరులో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, పినపాక అసెంబ్లీ అధ్యక్షుడు గంగారపు రమేష్, మణుగూరు మండల అధ్యక్షుడు రావులపల్లి వెంకటేశ్వర్లు, ఏంపల్లి సతీష్ సుభాష్ విష్ణు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.