Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని నడిమిగూడెం, బోడాయికుంట గ్రామ పంచాయతీల నడుమ ప్రవహించే చింతలపాడు వాగుపై తాత్కాలిక పైప్ కల్వర్టు బోడాయికుంట సర్పంచ్ వెంకట్ నారాయణ శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోడాయికుంట, అడవిరామవరం గ్రామాలకు చెందిన రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి మండల కేంద్రానికి, ఇతర పట్టణాలకు తీసుకుని వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న చింతలపాడు వాగు దాటే సమయంలో నానా అగచాట్లు పడుతున్న దశ్యం ఈ నెల 21వ తేదీన ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్వయంగా చూడటం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ సత్వరమే రైతుల, ప్రజల రాకపోకల సౌకర్యార్థం కల్వర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. దాంతో కల్వర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నడిమిగూడెం, మర్కోడు సర్పంచ్ లు నరసింహారావు, శంకర్ బాబు పాల్గొన్నారు.