Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సమస్యలు పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం
అ వైఎస్ఆర్ టిపీ ఖమ్మం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ నరాల సత్యనారాయణ
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులకు వైఎస్ఆర్ టిపీ అండగా ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడంలేదని వైఎస్ఆర్ టిపీ ఖమ్మం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ నరాల సత్యనారాయణ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో మిర్చి పంట వల్ల నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.1లక్ష చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ తరఫున రైతు కుటుంబాలకు అండగా ఉంటామని, క్రిస్మస్ రోజున రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని నరాల సత్యనారాయణ కోరారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ తోడుగా నీడగా అండగా ఉంటామని ఏ కష్టం వచ్చినా, వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా అశ్వాపురం మండలంలో చనిపోయిన వై.పురుషోత్తం, ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంకు చెందిన నాగండ్ల నాగేశ్వరరావుకు, మేడి శ్రీను, తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన పులి వెంకట్రామయ్య, ఏన్కురు మండలం, శ్రీరామగిరికి చెందిన దుంపల ప్రసాద్, అంజనాపురం రూప్లా తండాకు చెందిన తేజావత్ జగన్ కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుల కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ఎస్టీ సెల్ కన్వీనర్ మాలోతు విజరు కుమార్, నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ బోడ పాల్ రాజ్, ఎస్సీ సెల్ కన్వీనర్ హిమేష్, ముస్లిం మైనార్టీ ఇన్చార్జి యాకూబ్ పాషా, ప్రధాన కార్యదర్శి గోపాల్ రావు, ముస్లిం యూత్ విభాగం కార్యదర్శి షేక్ అలీమ్, కన్వీనర్ బత్తుల అజరు, యువజన విభాగం ఉపాధ్యక్షుడు, వీరమల్ల వికాస్, సహాయ కార్యదర్శి దుర్గ, బీసీ సెల్ కన్వీనర్ రామకృష్ణ, మహిళా ప్రధాన కార్యదర్శి నాగరత్నం, నియోజకవర్గ కో-కన్వీనర్ ఆర్బి. రాజా, దమ్మపేట మండలం అధ్యక్షుడు,పాక పటి శ్రీను, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు వెంకటేశ్వరరావు, ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి కందుకూరి రాంబాబు, మండల ప్రచార కమిటీ కో-కన్వీనర్ పైడిమర్రి వెంకన్న, కో కన్వీనర్ దూడల రాము తదితరులు పాల్గొన్నారు.