Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అందరినీ కనీస మార్కులతో పాస్
చేయడం విద్యార్థుల విజయం
అ విద్యార్థి సంఘాల పోరాట ఫలితం
వామపక్ష విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్రంలో ఇంటర్ ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఫెయిల్ అయిన అందరినీ కనీస మార్కులతో పాస్ చేయడం విద్యార్థుల విజయమని, ఇది ముమ్మాటికి విద్యార్థి సంఘాల పోరాట ఫలితమని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యూ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యూ, టివివి విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. శనివారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలో స్థానిక శేషగిరి భవన్లో వామపక్ష విద్యార్థి సంఘాల ముఖ్య నాయకుల సమావేశం పీడీఎస్యూ రాష్ట్ర నాయకురాలు జాడి మంజుల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ ఫాహీమ్ ఖాన్, పిడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబ, టివివి జిల్లా నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడం ముమ్మాటికి విద్యార్థి సంఘాల ఉద్యమాల విజయమని, ఐక్య వామపక్ష విద్యార్థి సంఘాల పోరాట ఫలితమని తెలిపారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.