Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి పువ్వాడ అజరుకుమార్
నవతెలంగాణ-గాంధీచౌక్
యావత్ దేశాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యలకై అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ ఖమ్మం జిల్లాలో 100 శాతం పూర్తి చేసిన సందర్బంగా జిల్లా యంత్రాంగాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అభినందించారు. జిల్లాలో 100 శాతం వాక్సినేషన్ మొదటి డోస్ పూర్తి స్థాయిలో అందించిన సందర్భంగా సోమవారం ఖమ్మం నగరంలోని జడ్పీ హాల్ నందు నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు పని చేసిన సంబంధిత శాఖల అధికారులకు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారని, వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారని అందుకు వారికి అభినందనలు తెలియజేశారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రంగం, సిబ్బంది సహసోపేతంగా పనిచేశారని గుర్తు చేశారు.రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసుని అందరూ తప్పకుండా వేయించుకోవాలని, బూస్టర్ డోస్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి అన్నారు. సోషల్ డిస్టెన్స్తో పాటు ప్రతి ఒక్కరు మాస్కులు తప్పక ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ట్రేడర్స్కు వాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ఖమ్మం జిల్లానే ముందంజలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులకు విడతల వారిగా పూర్తి స్థాయిలో వాక్సిన్ను అందించమన్నారు. టీకాలు వేసుకొనేందుకు ఆసక్తి చూపని వారు, గడువు ముగిసినా రెండో డోస్ వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయనున్నా మన్నారు. రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొదటి డోస్ 99.35 శాతానికిపైగా వేయగా, 63.40 శాతం మందికి రెండో డోస్‌లు అందించడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం వ్యక్తం చేశారు. 100 శాతం వాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు సిబ్బందిని శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజరు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డిఎంహెచీ మాలతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.