Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిపో మేనేజర్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ- రఘునాధపాలెం
మండల పరిధిలోని కామంచికల్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్‌కు సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.నవీన్‌రెడ్డి మాట్లాడుతూ దానవాయిగూడెం, రామన్నపేట, కామంచికల్, దారేడ్, జాన్ బాడ్ తండా గ్రామాల నుండి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు తమ పనుల కోసం ఖమ్మం నగరానికి వస్తున్నారన్నారు. సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఉపాధి కోసం నగరానికి వస్తున్న బిల్డింగ్ కార్మికులకు, చదువుల కోసం నగరానికి వస్తున్న విద్యార్థులకు బస్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు. మహబూబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలు కూడా ఈ రోడ్డు మార్గం ద్వారానే ఖమ్మం వస్తున్నారని, అంత రద్దీగా ఉండే రోడ్డుకి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. తక్షణమే లోకల్ బస్సుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, అనంతనేని వీరయ్య, గండు లక్ష్మీనారాయణ, చెరుకూరి మురళీకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.