Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
మండలంలోని బాలాజీ నగర్ తండ గ్రామపంచాయతీ బీచ్ రాజు పల్లి తండాలో శ్రీసీతారాముల నూతన దేవాలయం నిర్మాణానికి పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సహకారంతో జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తిరుమలాయపాలెం పిఎసిఎస్ చైర్మన్ చావా వేణుగోపాలకృష్ణ సోమవారం 3 లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాషబోయిన వీరన్న, ఎంపీపీ బోడ మంగీలాల్, పిఎసిఎస్ చైర్మన్ చామకూరి రాజు, సర్పంచులు బోడ మంచ నాయక్, బైరా మౌనిక, మాలోత్ భారతి, ఎంపిటిసిలు అంబేద్కర్ శాంతమ్మ, మోహన్, టిఆర్ఎస్ మైనార్టీ మండల అధ్యక్షులు చందు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు భానోత్ బాలు నాయక్, పోలే పొంగు వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు బోడ హెమ్ల, నేరడ సత్యం, బుగ్గారపు శ్రీకాంత్, రాంబాబు, శ్రీను, హరి తదితరులు పాల్గొన్నారు.