Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్షక బిడ్డగా రైతాంగ సమస్యలు తెలుసు
నాగులవంచలో గోదాం శంకుస్థాపనలో ఎంపీ నామ
నవతెలంగాణ-చింతకాని
దేశంలో వ్యవసాయం చేసి ధాన్యం పండించడం ఎంత కీలకమో దాన్ని నిల్వ చేయడం కూడా అంతే కీలకమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు పేర్కొన్నారు. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో నాబార్డు నిధులతో సహకార సంఘం గోదాము నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. కర్షక బిడ్డగా తనకు రైతాంగ సమస్యలు పూర్తిగా తెలుసని వెల్లడించారు. గోదాములు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో వ్యవసాయం వృద్ధి చెంది... దేశంలోని గ్రామాలన్నీ ప్రగతి బాటన పడతాయని చెప్పారు. చైనా, అమెరికా వంటి అభివద్ధి చెందిన దేశాల్లో ప్రతి గ్రామంలో గోదాం, ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని గుర్తు చేశారు. మన దేశంలో కూడా కేసీఆర్ వంటి పట్టుదల నాయకుడు ఉంటే రైతాంగం ఏదయినా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలో ఈ విషయానికి సంబంధించి ప్రగతికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ హామీనిచ్చారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ పూర్ణయ్య, మండల జడ్పీటిసి పర్సగాని తిరుపతి కిషోర్, నాగులవంచ సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, సర్పంచ్ నాగమణి, ఎంపీటీసీలు సరోజిని, నాగరత్నమ్మ, డీసీసీబీ వీరబాబు, జిల్లా సహకార అధికారి విజయకుమారి, పెంట్యాల పుల్లయ్య, వంకాయలపాటి లచ్చయ్య, వైస్ ఎంపీపీ హనుమంతరావు, మంకెన రమేష్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.