Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండలంలోని ఏదులాపురం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సిఫార్సు ద్వారా మంజూరైన ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు సిపిఎం సీనియర్ నాయకులు మామిండ్ల సంజీవ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌లు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కార్పోరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏదులాపురం గ్రామానికి చెందిన బుద్ధి సురేందర్, బొడ్డు వెంకటేష్, బొడ్డు శంకర్, మిరియాల వెంకట నరసయ్య, శీలం కరుణమ్మలకు మంజూరైన చెక్కులను వారికి అందజేయడం జరిగిందన్నారు. చెక్కుల మంజూరులో ఏదులాపురం సిపిఎం నాయకులు ఉరడీ సుదర్శన్‌రెడ్డి చేస్తున్న కృషిని కొనియాడారు. ఏదులాపురం గ్రామంలో ఇప్పటికే 96 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించిన ఘనత సుదర్శన్రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా నాయకులు ఉరడీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు దుండిగల నాగయ్య, లింగయ్య, పోతురాజు భద్రయ్య, కొండ రవి, మామిండ్ల రవి, బొడ్డు వీరభద్రం, ఉదరు, సాయి, నరేష్, శ్రీను, డివైఎఫ్ఐ నాయకులు గడ్డం సిద్ధూ, పొన్నెకంటి అనిష్, ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.