Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లిలో ఉత్సాహంగా జరుగుతున్న అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆటస్థల మైదానంలో స్థానిక అనుమోలు నరేశ్‌కుమార్ మెమోరియల్ (ఏఎన్‌కే) ట్రస్ట్) వారి ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు నేటి నుంచి (మంగళవారం) క్వార్టర్ ఫైనల్ చేరిందని ట్రస్ట్ నిర్వాహకులు మనోహర్ అనుమలో తెలిపారు. సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో కొత్తగూడెం వర్సెస్ భద్రాచలం జట్లు తలపడగా భద్రాచలం విజయం విజయం సాధించింది. అలాగే సత్తుపల్లికి చెందిన వైఎంసీసీ వర్సెస్ కల్లూరు జట్లు పోటీపడగా కల్లూరు జట్లు విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్‌లో పాల్గొన్న క్రీడాకారులకు సీనియర్ సత్తుపల్లికి చెందిన క్రికెటర్ చీపు గంగాధర్ జెర్సీలను అందించారు. జనవరి 4వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని భరత్ తెలిపారు.