Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
వెనకబడిన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ మండల అధ్యక్షుడు పల్లపాటి కష్ణ అన్నారు.కాంగ్రెస్ పార్టీ మండల బీసీసెల్ కార్యవర్గ సమావేశం ముదిగొండలో కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ బాబు నివాసంలో సోమవారం జరిగింది. ఈసమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎల్పీ నేత,మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తారీఖున మండల పరిధిలో యడవల్లి గ్రామం నుండి ప్రజాసమస్యలపై చేపట్టబోయే పాదయాత్రలో బీసీ సెల్ గ్రామ అధ్యక్షులతోపాటు ముఖ్యనాయకులు అందరూ పాల్గొనాలన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, మాజీ జెడ్పిటిసి బుల్లెట్ బాబు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు చెరుకుపల్లి రాంబాబు, బీసీ సెల్ మండల కార్యదర్శి దారగాని గోవిందరావు, మల్లన్నపాలెం బిసి సెల్ గ్రామ అధ్యక్షుడు చిర్ర లింగయ్య, యడవల్లి గ్రామ అధ్యక్షులు దొంతగాని నరసింహారావు, న్యూలక్ష్మీపురం గ్రామ అధ్యక్షులు మారుతి వీరయ్య, కట్టకూరు గ్రామ అధ్యక్షులు నాగేశ్వరావు, కమలాపురం అధ్యక్షులు పరసగాని ఆదినారాయణ, గంధసిరి గ్రామ అధ్యక్షులు పాలకీర్తి రాఘవులు, సువర్ణపురం గ్రామ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు వల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.