Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో సోమవారం జమలాపురం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను బ్యాంక్ మేనేజర్ జి అశోక్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ అశోక్ మాట్లాడుతూ ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ ద్వారా ఖాతా దారులు బ్యాంక్ ద్వారా అందించే అన్ని సేవలు పొందవచ్చునని తెలిపారు. అన్ని కస్టమర్ సర్వీస్ పాయింటులలో 25 వేల రూపాయలు లోపు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉందని, ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్లో 50 వేల రూపాయల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కలగ చేస్తున్నామని అన్నారు. 45 వేల రూపాయలు వరకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బొగ్గుల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ కస్టమర్ పాయింట్ ఏర్పాటుతో వెంకటాపురం, రాజుపాలెం, నారాయణపురం, గట్ల గౌరారం, సత్యనారాయణపురం, నరసింహపురం గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరమని, ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ సెంటర్ ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొగ్గుల లక్ష్మి రెడ్డి, రాజుపాలెం సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపిటిసి దోమందుల సామేలు, శీలం జయలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు వెన్నపూస కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఎన్ శ్రీనివాసరావు, బి అనిల్ కుమార్, సిబ్బంది ఎస్.వాసు, శివాజీ, గ్రామస్తులు, ఖాతాదారులు పాల్గొన్నారు.