Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్ ప్రాంతంలో గల ఆర్జేసీ విద్యాసంస్థల్లో విద్య నభ్యసించి ప్రస్తుతం అటవీ శాఖలో డిఎఫ్ఓ, ఎఫ్ఆర్ఓలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న రాధిక, సతీష్, శ్రీనివాస్, దీపికా, రేణుక తమ ఉద్యోగ విధుల్లో భాగంగా మంత్రి కార్యాలయంకు వచ్చారు. ఇదే సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీగా ఉన్న గుండాల(ఆర్జేసీ)కృష్ణ మంత్రిని కలిసేందుకు అక్కడికి వచ్చారు. ఇది చూసిన ఆనాటి విద్యార్థులు, ప్రస్తుత అధికారులైన వారు ఒక్కసారి గా ''సార్ నమస్కారం.... మేము మీ ఆర్జేసీ కళాశాల విద్యార్థులం సార్ ....''అంటూ విద్యార్థులుగా మారిపోయారు. ''ఆనాడు చైర్మన్ గానే కాకుండా అధ్యాపకుడిగా మీరు అందించిన సలహాలు, సూచనలతో పాటు మీ ప్రోత్సాహం వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నాము సార్...''అంటూ ఆనంద భాష్పాలు కార్చారు. ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఒక అధ్యాపకుడిగా తనకు గర్వంగా ఉంటుందని ఆర్జేసీ కృష్ణ అన్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి అక్కడినుండి మంత్రిని కలిసేందుకు వెళ్లారు.