Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్
- జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌కు వినతి
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి జేవీఆర్ ఓసీపీ-2 భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నాయకత్వంలో జాజిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూనిర్వాసితులు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌ను కలిసి సమస్యలు వివరించి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జాజిరి మాట్లాడుతూ 489.00 కుంటల భూమిని సేకరించిన సింగరేణి అందులో 125.00 కుంటలకు ఇంతవరకూ నష్ట పరిహారం ఇవ్వలేదని తెలిపారు. రేజర్లలో భూమిని సేకరించినప్పుడు ఎకరాకు రూ.25లక్షలు ఇచ్చారని అదే విలువను కొమ్మేపల్లి భూములకు కూడా వర్తింపజేయాలని కోరారు. అదే విధంగా గతంలో ఎంజారుమెంట్ సర్వే ప్రకారం ఇచ్చిన నెంబర్లనే లిస్టులో నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంతు రాంబాబు, మాదినేని రమేష్, తాతా భాస్కర్‌రావు, నిర్వాసితులు వెల్ది ప్రసాద్, సింగపోగు పుల్లారావు, ప్రసాద్, అంబోజు నారాయణ, మోరంపూడి ప్రసాద్, రత్నాకర్ పాల్గొన్నారు.