Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
పిల్లలు ఎత్తుకు తగిన బరువు వుండే విధంగా తల్లులు చూసుకోవాలని సి.డి.పి.ఓ నిర్మల జ్యోతి చెప్పారు. మండల పరిధిలోని నమావరం అంగన్వాడీ సెంటర్ నందు సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో సెక్టార్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల జ్యోతి మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని అరోగ్యలక్ష్మి మెనూ ప్రకారం వంటలు చేయాలని సమయ పాలన ప్రకారం టీచర్లు సెంటర్లను నిర్వహించాలని అదేవిధంగా ప్రతి నెల 5 సంవత్సరాల పిల్లలు ఎత్తు బరువు చూసి ఆన్ లైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయనిర్మల, సరస్వతి, శ్రీదేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.