Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
మండల కేంద్రమైన బూర్గంపాడులో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ 137వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. బూర్గంపాడు మండల ఇన్చార్జ్ దుగ్గింపూడి కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణిలు పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం నాయకులు పార్టీ చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల ఇన్చార్జి దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ, పినపాక నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, పినపాక యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి యాకూబ్ పాషా, బూర్గంపాడు టౌన్ అధ్యక్షులు మంద నాగరాజు ,సీనియర్ నాయకులు మాజీ గ్రామ సర్పంచ్ జక్కం బలరాం పాల్గొన్నారు.