Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
అర్హులైన ప్రతిఒక్కరికీ కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగు తున్నామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం బూర్గ ంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ భూక్యా శ్రావణి, శివ దంపతులు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే రేగా సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. వారితో పాటు మరో 100 కుటుంబాలు గులాబీ కండువాను కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారందరినీ ఎమ్మెల్యే రేగా సాదరంగా ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ పొడియం ముత్యాలమ్మ, బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, సర్పంచ్లు సిరిపురం స్వప్న, తాటి వీరాంజనేయులు, కుంజా చిన్నబ్బాయి, పాయం వెంకటేశ్వర్లు, కోడెం వెంకటేశ్వర్లు, సోంపాక నాగమణి, ఉపసర్పంచ్లు యడమకంటి ఝాన్సీలక్ష్మి, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు