Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ములకలపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మంగళవారం సాదాసీదాగా ముగిసింది. ఎంపీపీ మట్ల నాగమణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సమావేశానికి అత్యధిక శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టగా హాజరైన వారితోనే సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు మద్యం దుకాణాల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ అధికారులను నిలదీశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్వహించడంలేదని, ఎమ్మార్పీ ధరకు కాకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, ఒకచోట అనుమతి వస్తే మరోచోట గ్రామానికి దూరంగా మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపీపీ పుల్లారావు, ఎంపిడివో చిన్న నాగేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.