Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధిష్టానం దృష్టిలో వారున్నారు...
ఎమ్మెల్సీ తాత మధు
నవతెలంగాణ-కొత్తగూడెం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత మంద ప్రజా ప్రతినిధులు పార్టీ నిబంధనలు ఉల్లంఘించి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని, ఈ విషయంలో అధిష్టానం చాలా సీరియస్‌గా ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యాక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేందర్ రావు అధ్యతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు తరువాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. నూటికి 98 ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో పార్టీలో ఉంటు కొంత మంద ప్రజా ప్రతినిధులు పార్టీకి అన్యాయం చేయాలని చూశారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర పార్టీ సీరియస్‌గా ఉందని తెలిపారు. రాన్నురోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని రాష్ట్రాభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కీలారు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బరపాటి వాసు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపిపి బాదావత్ శాంతి, భూక్యా విజయలక్ష్మి, భూక్యా సోన, సరస్వతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూ గర్ చైర్మన్ అన్వర్ పాషా, పెద్దమ్మ గుడి చైర్మన్ మహీపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, నాయకులు ఊకంటి గోపాల్ రావు, కాసుల వెంకట్, ఎంఏ. రజాక్, తూము చౌదరి, బీమా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.