Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధ్యక్షురాలుగా యు.జ్యోతి, కార్యదర్శిగా డి. సీతాలక్ష్మి
నవతెలంగాణ-భద్రాచలం
అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నూతన కమిటీ ఎన్నుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐద్వా అధ్యక్షురాలు ఎస్.రాజమ్మ, జిల్లా కార్యదర్శి ఏం.జ్యోతిల సమక్షంలో 29 మందితో నూతన టౌన్ కమిటీ, 10 మంది ఆఫీసు బ్యారెర్స్గా ఎన్నుకున్నారు. నూతన ఐద్వా పట్టణ అధ్యక్షురాలు యు.జ్యోతి, నూతన పట్టణ కార్యదర్శిగా డి.సీతాలక్ష్మిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ రానున్న కాలంలో మహిళ సమస్యలపైన అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. హింసకి వ్యతిరేకంగా మహిళ చట్టాలు అమలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు ఎన్. లీలావతి, బి.కుసుమ, ఎస్.గంగ, ఏ.సక్కుబాయి, జీవన జ్యోతి, సి.హెచ్.రమణ, జి.రాధ తదితరులు పాల్గొన్నారు.