Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి అధ్యయనోత్సవాల పోస్టర్ ను
ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు
మంత్రికి ఆహ్వానం
12న తెప్పోత్సవం,
13న వైకుంఠ ద్వార దర్శనం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాల పోస్టర్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళ వారం ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్స వాలకు రావాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు హైదరాబాద్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి అల్లోలకు వేద పండితులు ఆశీర్వచ నం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి ఆధ్యయనోత్సవ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసు కున్నారు.
భద్రాద్రిలో జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఆలయ ఈవో బి.శివాజీ, దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు పొడిచేటి గోపాలక్రిష్ణమా చార్యులు, ముఖ్య అర్చకులు కే. శ్రావణ్ కుమార్ ఆచార్యులు,వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.