Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ఎదుట సీఐటియు ధర్నా
- కలెక్టర్ సర్య్కూలర్ ప్రకారం
- రూ.723 వేతనం చెల్లిస్తాం
- బకాయి వేతనాలు చెల్లింపుకు చర్యలు తీసుకుంటాం
- సమస్యల పరిష్కారానికి ఐటిడిఎ డిడి హామీ
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలివేజ్ ,ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, బకాయి వేతనాలు ఇవ్వాలని కోరుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలివేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు ఐటిడిఎ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఐటిడిఎ డిడి రమాదేవికి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి మట్లాడుతూ 2020 మే నెల నుండి 2021 సెప్టెంబర్ నెల వరకు కరోనా లాక్ డౌన్ కాలానికి రావలసిన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 2021 సెప్టెంబర్ నుండి హాస్టల్స్ ప్రారంభమయ్యాయని, అప్పటి నుండి రావలసిన బకాయి వేతనాలు కూడా చెల్లించాలని ఆయన అన్నారు.
గిరిజన బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు 11 నెలల వేతనాలు లేక తీవ్రమైన అవస్ధలు పడుతున్నారని వారి వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, జిల్లా కలెక్టర్ సర్క్యూలర్ ప్రకారం వేతనాలు పెంచి రోజుకు రూ. 723చెల్లిస్తామని డిడి రమాదేవి తెలిపారు. పిఎం హెచ్ వర్కర్లకు 30 శాతం పిఆర్సి అమలు చేస్తామని ఆమె తెలిపారు.
ఈశ్రమ్ పోర్టల్ ద్వారా అందరికి ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరికి డైలివేజ్ వర్కర్ పోస్టు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీఈడీ కళాశాల కార్మికుల వేతన బకాయిలు చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారంచేయకపోతే సమ్మెచేస్తామని సిఐటియు నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కోశాధికారి పద్మ, టౌన్ కన్వీనర్ వై.వెంకట రామారావు, నాయకులు యన్.నాగరాజు, హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు హీరాలాల్, ముత్తయ్యా, కౌశల్య, ముసలయ్య, పద్మ, సమ్మక్క, స్వరూప, లక్ష్మయ్య, లక్ష్మి, స్వామి తదితరులు పాల్గొన్నారు.