Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
హైదరాబాద్లో మంగళవారం జరిగిన రైతు సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతు సదస్సులో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని తద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపారు. ప్రభుత్వం నుండి అందే సబ్సిడీలను రైతులకు సంబంధించిన పలు ఇతర వ్యవసాయ అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్ పాల్గొన్నారు.