Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంపీ నామ నాగేశ్వర్రావు దిశానిర్దేశం
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
జీవితంలో ఉన్నత శిఖరాలకు రావాలనుకున్న విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు సూచించారు. మంగళవారం ఆయన ఖమ్మం పర్యటనలో భాగంగా గాంధీనగర్లోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వసతుల గురించి ఉపాధ్యాయులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు ఆయన ప్రత్యేకంగా గడిపారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, సౌత్ సెంట్రల్ రైల్వే మెంబెర్ మెళ్ళచేరువు వెంకటేశ్వరరావు, 32, 36వ డివిజన్ కార్పొరేటర్లు డి.సరస్వతి, పసుమర్తి రామ్మోహన్రావు, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, బాణాల వెంకటేశ్వరరావు, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, తాళ్ళూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు