Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి సీఎండీని కోరిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి వయా ఎన్టీఆర్నగర్, కొత్తూరు మీదుగా మండలంలోని రేజర్ల వరకు నాలుగు లైన్లతో రోడ్డును నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను కోరారు. హైదరాబాద్‌లో ఉన్న సింగరేణి సీఎండీ కార్యాలయానికి ఎమ్మెల్యే సండ్ర మంగళవారం వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, డివైర్ ఏర్పాటు తదితతరాంశాలను సీఎండీ శ్రీధర్‌కు వివరించారు. నాలుగు లైన్ల రోడ్డుకు సత్తుపల్లి బస్టాండ్ అవుట్ గేట్ నుంచి సత్తుపల్లి పరిధి వరకు సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అక్కడి నుంచి రేజర్ల వరకు సెంట్రల్ డివైడర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం పైన తెలిపిన రోడ్డు నిర్మాణం ఏర్పాటుకు సంబంధించి సీఎండీ శ్రీధర్‌కు ఎమ్మెల్యే సండ్ర వినతిపత్రం అందించారు. ఇందుకు స్పందించిన సింగరేణి సీఎండీ నిధులు మంజూరు అంగీకరించారు. తక్షణమే ప్రతిపాదనలు రూపొందించి అందించాలని ఎమ్మెల్యే సండ్రను సీఎండీ కోరారు.