Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
వైరా మున్సిపాలిటీ పరిధిలోని మధిర రోడ్డు రెసిడెన్షియల్ పాఠశాలలు ముందు సంవత్సరాల నుండి చేతివృత్తి, చిరు వ్యాపారులు చేసుకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ఇటీవల అధికారులు తొలగించిన చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారుల షాపుల బాధితుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ గత ఏభై సంవత్సరాల నుండి చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, కొణిజర్ల మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, పొన్నం శ్రీనివాసరావు, పద్మా, సుజాత, షేక్.బేగం, చిదిరాల సుభద్ర, తౌటపు రామారావు, బాధితులు పాల్గొన్నారు పాల్గొన్నారు