Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
జిల్లాలో మిర్చి సాగుచేసి నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఏన్కూర్ మండల కమిటీ సమావేశం ఇటికాల లెనిన్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అత్యధిక మంది రైతులు మిర్చి పంట వేసి ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయారన్నారు. జిల్లాలో మిర్చి పంట సాగుచేసింది ఏన్కూరు మండలంలోనేనని, దీంతో అత్యధిక శాతం దెబ్బతిన్న మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని పంట నష్టపరిహారం ఎకరానికి లక్ష రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని ఆయన అన్నారు. రైతులు సుమారుగా ఎకరానికి లక్ష ఇరవై వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి నష్టపోయారని ఆయన అన్నారు .సిపిఎం పార్టీ అన్ని మండలాల్లో సర్వే చేసి పంట నష్టాన్ని అంచనా వేసిందన్నారు. నష్టపరిహారం చెల్లించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శి దొంతెబోయిన నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు ఏర్పుల రాములు, రేపల్లెవాడ ఎంపిటిసి సభ్యులు భూక్య లక్ష్మణ్, నండూరి శ్రీనివాసరావు, తమ్మినేని వెంకటయ్య, బండ్ల చిన్న జోగయ్య, వేణు, రామచంద్రయ్య, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.