Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
మధిర క్రాస్ రోడ్డు వద్ద గంటపాటు యుద్ధవాతావరణం. ఇసుక మాఫియా డాన్లకు జూనియర్లు దేహశుద్ధి చేసిన సంఘటన మండల పరిధిలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంంగా మారింది. బోనకల్ మండలం లో ఇసుక మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్న సురేంద్ర కు అతని సహచర గ్యాంగ్‌కు గంటపాటు జూనియర్లు దేహ శుద్ధి చేసి షాక్ ఇచ్చారు. ఆ ఇసుక మాఫియా డాన్ చివరకు మీడియా ప్రతినిధులను కూడా వదిలి పెట్టడం లేదు. తన కనుసన్నల్లో అధికారులు ఉన్నారని తాను ఏదైనా చేస్తానంటూ డాన్ రెచ్చిపోతున్నాడు. అనేక మంది బాధితులు మీడియా ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు కోకొల్లలు. ఆ ఇసుక మాఫియా డాన్ ఎవరో కాదు బోనకల్ మండలంలోని రాయన్నపేట గ్రామానికి చెందిన రాయల సురేందర్. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన రాయల సురేందర్ గత ఐదారు సంవత్సరాలుగా ఇసుక మాఫియా డాన్ అవతారమెత్తాడు. మండలంలో మోటమర్రి కలకోట, రాయన్నపేట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాల నుంచి వైరా నది ఇసుకను0 జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలో ఇసుక తోలాలి అంటే ఎవరైనా ట్రాక్టర్ యజమానులు ఇతనిని కలవాల్సిందే. లేకపోతే ఇసుక కూపన్లు వారికిి రానివ్వకుండా అడ్డుకుంటాడు. అధికారుల వద్ద కూపన్లు తీసుకువచ్చి ఇసుక ట్రాక్టర్ల యజమానులకు ఇస్తాడు. ఇతను మాట వినకుండా ఏ ట్రాక్టర్ వాళ్ళు విరుద్ధంగా వ్యవహరించిన వారికి కూపన్లు రాకుండా అడ్డుకుంటాడు. సురేందర్ ని కాదని ఇసుక తోలితే అతనికి కష్టాలే. అధికారుల నుంచి ఒక కూపన్ తీసుకొని రోజుకి ఆ కూపన్ పేరుతో సుమారు ఐదారు ట్రాక్టర్ల ఇసుక తరలిస్తాడు. ఆ సమయంలో ఎవరైనా కిందిస్థాయి సిబ్బంది అడ్డుకుంటే వారికి మామూలు ఇచ్చి అడ్డు తొలగించు కుంటాడు. ఈ ఇసుక మాఫియా డాన్ ప్రతిరోజు వందలాది ట్రాక్టర్ల ఇసుకను ఖమ్మం జిల్లాలోనే ఇతర ప్రాంతాలకు సురేందర్ తరలిస్తున్నారు. బోనకల్ మండలం లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇసుక ర్యాంపులు లేవు. కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సురేందర్ అతని గ్యాంగ్ ప్రతిరోజు వందలాది ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారు. అదేమిటని అడిగితే ప్రభుత్వ కార్యక్రమాలకు అని సమాధానం చెప్పటం లేదంటే బెదిరించటం వీరికి అలవాటుగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఆర్డర్లు తీసుకు వచ్చి బోనకల్ మండలంలోోని గ్రామాలకు, ఖమ్మం పట్టణంతోో పాటు ఇతర గ్రామాలకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడు. బోనకల్ మండల ప్రజలకు ట్రాక్టర్ ఇసుకను మూడు వేల నుంచి ఆరు వేల వరకు అమ్ముతున్నారు. బోనకల్ మండలం దాటితే ఖమ్మం వరకు పది వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక కూపన్‌తో ప్రతిరోజు సుమారు ఐదారు ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఒక కూపానికి డిడి చెల్లించి ఆ కూపీన్ పేరుతో మిగిలిన నాలుగు ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారు సురేందర్ గ్యాంగ్. ఇసుక డాన్ సురేందర్ ని చూసి జూనియర్లు వణికిపోతున్నారు. అదేమిటని ప్రశ్నించిన జూనియర్ల ఇసుక ట్రాక్టర్లను పోలీస్, రెవెన్యూ అధికారులకు సురేందర్ గ్యాంగ్ ఫోన్లు చేసి పట్టిస్తున్నారు. దాదాపు రెండు నెలల నుంచి సురేందర్ గ్యాంగ్ వేధింపులు కొనసాగుతున్నాయి. ఈ వేధింపులు తాళలేక జూనియర్లు తీవ్ర ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సురేందర్ గ్యాంగ్ జూనియర్లన్లు రెండు నెలలుగా ఫోన్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సోమవారంం రాత్రి సురేందర్ గ్యాంగ్ మధిర క్రాస్ రోడ్డు వద్ద తిష్ట వేసింది. అప్పటిక్ఱే అక్క అ సురేందర్ గ్యాంగ్ కు చెందిన సుమారు 20 మంది ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. అదే సమయంలో జూనియర్ గ్యాంగ్ కూడా అక్కడకు చేరుకుంది. వీళ్ళు కూడా సుమారు 25 మంది వరకు ఉన్నారు. జూనియర్ బ్యాచ్‌ని చూసిన సురేందర్ కు ఒక్కసారిగా పూనకం వచ్చింది. సురేందర్ గ్యాంగ్ వారి దగ్గరికి వెళ్ల వాగ్వివాదానికి దిగారు. దీంతో జూనియర్ బ్యాచ్ కూడా ఎదురుదాడికి దిగింది. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకొని ఘర్షణకు దారి తీసింది. తీవ్ర ఆవేశానికి లోనైన సురేందర్ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిని కొట్టాడు. దీంతో కలకోట, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జూనియర్లు సురేందర్ ని అతని గ్యాంగ్ ని ఇరగ దీసినట్లు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. సురేందర్ గ్యాంగ్ లో బ్రాహ్మమణపల్లి గ్రామానికి చెంది కొంగర జగన్మోహన్ రావు కూడా ఉన్నారు. సురేంద్ర్తో పాటు జగన్మోహన్ రావుకు కూడా జూనియర్లు దేహశుద్ధి చేసినట్లు బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాలలో జోరుగా ప్రచారంం జరుగుతోంది. ఎట్టకేలకు సురేందర్ కు జూనియర్లు దేహశుద్ధి చేయటంతో సురేంద్రర కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సురేందర్ వేధింపుల జూనియర్ ఇసుక మాఫియా ఆనందంలో మునిగితేలుతోంది. బోనకల్ ఎస్ఐ గా తేజావత్ కవిత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచ ఇసుక మాఫియా దారులపై ఉక్కుపాదంం మోపుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ వ్యాపార ట్రాక్టర్లను సీజ్ చేస్తూ సంబంధిత వ్యక్తులపై కేసుల్ను నమోదు చేస్తున్నారు ఇసుక మాఫియ్షా పై ఎస్ ఐ ఉక్కుపాదంం మోపడంతో ఇస్నుక మాఫియా రవాణాకు కొంతమేర అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ సురేంద్ర గ్యాంగ్ రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా కి పాల్పడుతూనే ఉన్నారు. మధిర క్రాస్ రోడ్డు వద్ద జరిగిన వివాదానికి కారణం రాత్రి సమయంలో ఇసుక ట్రాక్టర్లను తరలించడానికి మధిర క్రాస్ రోడ్డు వద్దకు సురేంద్రర గ్యాంగ్ రావటం వల్లనే ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా జూనియర్లు ఇకనైనా తమ జోలికి రావటం మానుకోవాలని లేనియెడల భవిష్యత్తులో వెనక్కు తగ్గేది లేదంటూ సురేంద్రర గ్యాంగ్‌కి పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ఆయా గ్రామాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రెండు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటామని ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నట్లు తెలుస్తోంది.