Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ప్రజా సమస్యలు సీపీఎం పోరాటాల ద్వారానే సాధ్యమవుతాయని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకట రమణ అన్నారు. మండలంలోని కాచిరాజుగుడెం గ్రామ పంచాయతీలో గత రెండు సంవత్సరాలుగా ఇంకుడుగుంతల బిల్లులు చెల్లించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సిపిఐ(యం) ఆధ్వర్యంలో గ్రామస్థులు పలుమార్లు ఆందోళనలు, నిరసనలు చేయడంతో దిగివచ్చిన అధికార యంత్రాంగం మంగళవారం ఇంకుడుగుంతల బిల్లులు మంజూరు చేశారు. దీంతో సీపీఎం కార్యకర్తలు, గ్రామస్థులు గ్రామంలో విజయోత్సవ సభ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటరమణ మాట్లాడారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తూన్న పాలకుల,అధికారుల మెడలు వంచి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించి తమ హక్కులను సాధించుకున్న కాచిరాజుగుడెం గ్రామ పంచాయతీ ప్రజలకు విప్లవ జేజేలు తెలియజేశారు.పోరాడితే పోయేదేమిలేదని ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమిస్తే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. .కార్యక్రమంలో గ్రామ నాయకులు అద్దంకి తిరుమలయ్య, పొన్నం మురళి, చాంద్ పాషా, పొన్నం భాస్కర్ రావు, కారుమంచి గురవయ్య, కుక్కల సైదులు, ధరవత్ గణేష్, ధరవత్ దసరా, గుగులోతు విజయ, ధరవత్ సుందరం ,బాణోత్ నాగేశ్వరరావు, యల్ది శ్రీరాములు, వట్టికోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.