Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సోలార్ స్టడి ల్యాంప్ వినియోగంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. గురువారం సింగరేణి ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పునరుద్దరనీయక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఖమ్మం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మేనేజర్ ఉమాకాంత్, మనోజ్, రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ల్యాంప్ బహిరంగ మార్కెట్లో రూ.850 ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సీడిపై ఒకటి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు కేవలం రూ.70కే అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. సింగరేణి ఎడ్యుకేషన్ జీఎం జక్కం రమేష్ సూచనల మేరకు, పాఠశాల కరస్పాండెంట్ డిజియం పర్సనల్ రమేష్ ఆదేశానుసారం ఈ ల్యాంపులను విద్యార్థులకు అందజేయడానికి సోలార్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈజీ స్వరూపరాణి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.