Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సఖి కేంద్రం ఇన్చార్జ్ ఎస్సై రమాదేవి అన్నారు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సెల్ ఫోన్లో వచ్చే లింకులను ఓపెన్ చేస్తే అకౌంట్లో ఉన్న నగదు మాయం అవుతుందని పరిచయం లేని వ్యక్తులకు బాలికలు తమ ఫొటోలను పంపవద్దని అపరిచిత వ్యక్తులుకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో100కు ఫోన్ చేసి పోలీస్ సాయం పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో ఎస్సై బి.రాజేష్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు మంజుశ్రీ, ఫిజికల్ డైరెక్టర్ గంగా ప్రసాద్, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, సఖి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.