Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రక్షణ, ఆరోగ్య సంక్షేమమంపై సమీక్షించిన రక్షణ అధికారి శ్రీనివాసు
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి ఇల్లందు ఏరియాలోని వైసీఓఏ క్లబ్లో గురువారం సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు అధ్యక్షతన రక్షణ అధికారి శ్రీనివాసు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా రక్షణ అధికారి శ్రీనివాసు ఏరియాలో జరిగిన ప్రమాదాల వివరాలు, వార్షిక ఉత్పత్తి వివరాలను దృశ్య శ్రవణ రూపకం ద్వారా హాజరైన వివిధ మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లోని వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ యూనియన్ ప్రతినిధులకు వివరించారు. ఏరియాలోని వివిధ మైన్స్ అండ్ డిపార్ట్మెంట్లలో రక్షణపై తీసుకుంటున్నటువంటి చర్యలను అదే విధంగా రక్షణ సూత్రాలపై అవగాహన పెంచడం, పనిలో నైపుణ్యత పెంపొందించడం, రక్షణ నిర్వహణపై ప్రణాళికను తయారు చేయడం వంటి అంశాలపై చర్చించారు. పని స్థలాల్లో వారానికి రెండు సార్లు వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ పర్యటించి రక్షణ పరమైన లోటు పాట్లు గుర్తించిపై అధికారులకు తెలియజేయాలని, అంతే కాకుండా మైన్స్, డిపార్ట్మెంట్లో చట్ట ప్రకారం తీసుకోవాల్సిన రక్షణ, ఆరోగ్య, సంక్షేమ పరమయిన చర్యల గురించి సింగరేణి యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జీఎం బండి వెంకటయ్య, ఓసీ ప్రాజెక్టు అధికారులు బొల్లం వెంకటేశ్వర్లు, మల్లారపు మల్లయ్య, బండి సత్యనారాయణ, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్. యూనియన్ ప్రతినిధులు సంజీవరావు, నాగేశ్వరరావు, అశోక్ వివిధ మైన్స్ అండ్ డెపార్ట్మెంట్స్లోని వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.