Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని ఆర్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆయా గ్రామాల ప్రజలకు గురువారం తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సర్పంచ్ కొర్సా సునిత చేతుల మీదుగా చెత్త బుట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంట్లో సేకరించిన తడి పొడి చెత్తను గ్రామపంచాయతీ వారు అందజేసిన చెత్తబుట్టలో వేర్వేరుగా వేయాలన్నారు. పంచాయతీ కార్మికులు మీ ఇళ్ల వద్దకు వచ్చి ట్రాక్టర్ ద్వారా తడి పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారని ఆమె తెలిపారు. చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు పాయం లలిత, ఉపసర్పంచ్ కొర్సా నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.