Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని నడికుడి గ్రామంలో గల శ్రీ మహంకాళి చాముండేశ్వరి దేవి ఆలయానికి బుర్ర వేముల గ్రామానికి చెందిన బోర శ్రీనివాస రెడ్డి వెంకట లక్ష్మి దంపతులు రూ.51 వేల విరాళంగా అందజేశారు. ఆలయ ఆవరణలో వంట షెడ్డు నిర్మాణం కోసం అందజేసిన నగదును దాతలు గురువారం ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వంట షెడ్లు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. వంటశాల నిర్మాణం కోసం దాతలు ధన రూపేనా వస్తు రూపంగానైనా విరివిగా విరాళాలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొమరం నాగయ్య, ఆప్క శంకర్, కొమరం భద్రయ్య సత్యనారాయణ, ఆలయ పురోహితులు, యశ్వంత్ శర్మ ,హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.