Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనులకు గిరిజన చట్టాలు తెలియక తీవ్రంగా నష్టపోతు న్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు దుబ్బ గోవర్ధన్ అన్నారు. గురువారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో సంఘం జిల్లా నాయకులు ముడివి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలు నిర్వీర్యం కావడానికి కారణం గిరిజనులకు చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమేనని అన్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామస్థాయిలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి పూనేం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.