Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఒమిక్రాన్ విస్తరిస్తున్న క్రమంలో ఈ వైరస్ నుండి ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీఐ బంధం ఉపేందర్ రావు తన పరిధిలోని పోలీస్ స్టేషన్ కేంద్రాలైన అశ్వారావుపేట, దమ్మపేట ప్రజలను కోరారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు న్యూ ఇయర్ వేడకలను జరుపుకోవాలి అన్నారు. వేడుకలు శృతి మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నియోజకవర్గంలో అన్ని సబ్ డివిజన్ల అడిషనల్ ఎస్పీల పర్యవేక్షణలో 31వ తేదీ సాయంత్రం నుండి పటిష్ట బందోబస్తును అన్ని ముఖ్య కూడళ్ళలో ఏర్పాటు చేసి పోలీస్ పికెట్స్, రాత్రి గస్తీ బృందాలతో నూతన సంవత్సర వేడుకలలో ఎటువంటి అవాంచనీయ, రోడ్డు ప్రమాద సంఘటనలు జరగకుండా చూసేలా నిరంతర పోలీసు నిఘా ఉంటుందని, కావున ప్రజలు గమనించి స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ నూతన సంవత్సరం నియోజకవర్గ, మండల ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సరికొత్త విజయాలను అందుకొని ప్రతి ఒక్కరూ సంతోషంతో, ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
దుమ్ముగూడెం : నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ విధిగా ఇళ్లలోనే జరుపుకోవాలని సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు సూచించారు. రోడ్డు ప్రమాదాలను అదుపు చేయటంలో భాగంగా నూతన సంవత్సర వేడుకల్లో దుమ్ముగూడెం పోలీస్ వారు కొన్ని నిబంధనలను అమలు చేయడం జరుగుతుందన్నారు. వాహనాలను వేగముగా నడిపి నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండవలసిన సమయంలో రోడ్డు ప్రమాదాల బారినపడి విలువైన ప్రాణాలు పోగొట్టుకో వద్దని మండల ప్రజలు ముఖ్యముగా యువకులు పోలీసువారికి సహకరించాలని ఆయన తెలిపారు.
భద్రాచలం(బూర్గంపాడు) : నూతన సంవత్సర వేడుకలు నిబంధనల ప్రకారమే జరుపుకో వాలి బూర్గంపాడు ఎస్ఐ సము ద్రాల జితేందర్ పేర్కొన్నారు. గురువారం నవతెలంగాణతో మాట్లాడారు.
నూతన సంవత్సర వేడుకలను మండల ప్రజలందరూ నిబంధనల ప్రకారం ఇళ్లలోనే జరుపుకోవాలని ఆయన కోరారు. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్ రోజురోజుకు ఉధృతమవుతున్న నేపద్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. 31వ తేదీ రాత్రి నిర్ణీత సమయంలోనే మద్యం దుకాణాలు, డాబాలు, రెస్టారెంట్లు, హౌటల్లు మూసివేయాలని తెలిపారు.