Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఎస్ఎఫ్ఐ మండల కమిటీ, స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గార్లపాటి పవన్ కుమార్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, జెమ్మి యశ్వంత్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ధరావత్ నరసింహారావు, ఉదరు, చరణ్, వంశి, శివ, లక్ష్మణ్, ప్రవళిక, శ్రీవిద్య, శిరీష, అలేఖ్య, జోషి, భార్గవ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.