Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోపి
నవతెలంగాణ-మణుగూరు
అక్రమ ఇసుక దందాను ఆపకపోతే అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురిజాల గోపి హెచ్చరించారు. గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్వహిస్తున్న ఇసుక కోరీల యజమానులు వారికి ఉన్న అనుమతులను మించి, ఒక లారీ అనుమతి తీసుకుని, వందలాది లారీలు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, ఈ అక్రమ దందాను ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. రాయిగూడెం కోరీ నుండి అధికంగా ఇసుక అక్రమ రవాణా మణుగూరు మధ్య పట్టణం నుండి జరుగుతున్న అధికారులు చూస్తున్నారు తప్పా, అరికట్టడం లేదన్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ దందాను ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున ఆందోలన చేపట్టి, సహాకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకునే విధంగా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనీయర్ నాయకులు పాలమూరి రాజు, కె.నాగేశ్వరరావు, రామమూర్తి, సాంబశివరావు, మాధవరావు, పాల్వంచరాములు, సైదులు, బాలసుబ్రహ్మణ్యం, వేణు, విజరు, కిషన్ తదితరులు పాల్గోన్నారు.