Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యువత సన్మార్గంలో నడవాలి
అ టోర్నమెంట్ నిర్వహణ అభినందనీయం
అ ఏఎస్పీ అక్షాంశ యాదవ్
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
క్రీడలతో దేహదారుఢ్యం సొంతం అని భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మండల కేంద్రం బూర్గంపాడులో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా కొనసాగుతున్న దుగ్గిరాల ఎల్లారెడ్డి మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. మెగా ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అయ్యప్ప లేవన్ 14.3 బాల్స్‌కి 10 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. 99 విజయ లక్ష్యానికి దిగిన యువ లేవన్ భద్రాచలం 13.1 ఓవర్లకి 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 48 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన లోకేష్‌కు లభించింది. విజేతగా భద్రాచలం యువ లెవెన్ జట్టు నిలిచింది. రన్నరప్‌గా పాల్వంచకు చెందిన అయ్యప్ప ఎలెవన్ జట్టు నిలిచింది. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు రన్నర్లకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు. మొదటి బహుమతిని దుగ్గి రెడ్డి ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం దుగ్గి రెడ్డి శ్రీ రామ్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలు రూ.30 వేల నగదును అందజేశారు. ద్వితీయ బహుమతి రూ.15116 నగదును బొల్లు వీరభద్రం జ్ఞాపకార్థం బొల్లు రవి అందజేశారు. మొదటి, ద్వితీయ ట్రోఫీలను బట్టా మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బట్ట విజరు గాంధీ అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గ్రామ పెద్దలు ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నం సత్య నారాయణ ఆయన సోదరులు సూర్య ప్రసాద్‌ల చేతుల మీదుగా అందజేశారు. ఈ టోర్నమెంట్ ఆద్య ంతం ప్రతి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు మ్యా న్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీలను మాజేటి రామకష్ణ ఆయ న కుమారులు సాయిలు అందజేశారు. టోర్నమెంట్ కు గ్రౌండ్‌ను పుప్పాల వెంకటేశ్వరరావు అందించారు.
క్రీడలతో దేహదారుఢ్యం సొంతం : ఏఎస్పీ
వ్యయ ప్రయాసలకోర్చి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఏఎస్పీ ఆక్షాంశ్ యాదవ్ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ టోర్నమెంట్ నిర్వహించడం అభినందిం చదగ్గ విషయమని అన్నారు. క్రీడలతో దేహదారుడ్య సొంతమవు తుందని ఆయన అన్నారు. మన్యంలో ప్రతిభకు కొదవలేదని దాన్ని వెలికి తీసే ఉత్సా హవంతులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక చిన్నారులచే నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. తహసీల్దార్ భగవాన్ రెడ్డి నాట్యం చేసిన చిన్నారులను అభినందించి నగదు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎస్ఐ సముద్రాల జితేందర్, సర్పంచ్ సిరిపురపు స్వప్న, సొసైటీ డైరెక్టర్ బోల్లు రవి, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ బట్టా విజరు గాంధీ, గ్రామ పెద్దల డాక్టర్ చేన్నం సత్యనారాయణ, సూర్యప్రసాద్, ఆర్.ఐలు శంకర్, అక్బర్, తోకల మోహన్ రావు, లైక్, గోనెల నర్సింహ రావు, పొప్పాలా వెంకటేశ్వర్లు, అడబలా వెంకటేశ్వరరావు, మజేటి రామకృష్ణ, సర్వేశ్వరరావు, రాజా, సోహెల్ పాషా, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శ్రీరామ్ రెడ్డి, భజన ప్రసాద్ కుమార్, సుధాకర్ రెడ్డి, శనగ కిషోర్, సత్తిపండు, బబ్బు రాయుడు, సారధి, క్రీడా కారులు పాల్గొన్నారు.