Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏమైనా జరిగితే వారిదే బాధ్యత
అ వార్డు మెంబర్ ఎస్కె.జమీలా బేగం
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తన వార్డులో అభివృద్ధి పనులు చేయాలని కోరితే తనపై కక్షకట్టారని, ఏమైన జరిగితే వారిదే బాధ్యతని మొండితోగు గ్రామ పంచాయతీ 1వ వార్డు మెంబర్ ఎస్కె జమీలా బేగం గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి పనులు చేయమంటే అధికారులు చేయకపోవడంలేదని 15 ఫీట్లదారి అక్రమణకు గురి అయిందని తెలిపారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని, డ్రైనీజీలు రోడ్లు కూడాలేవని ఇల్లందు ఎంపీడీఓ ఎంపీవో ఆఫీస్ ముందు ఇటీవల నిరసన తెలియజేశాన్నారు. అప్పటి నుండి నాపై నా వార్డులోని స్థానికులపై హత్యా ప్రయత్నానికి ప్రత్నిస్తున్నారని తెలిపారు. వీరికి వత్తాసు పలుకుతున్న కొందరు ప్రజాప్రతి నిధులు అందులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపతినిధి కుమారుడు మున్సిపల్ కౌన్సిలర్ వేరే వార్డు మరికొతమంది నాయకులు ఉన్నట్టు తెలుస్తుందన్నారు. గతంలో ఇక్కడ ప్రశ్నిస్తున్న ఒక కుటుంబంపై అక్రమార్కులు దాడి చేసారని తెలిపారు. ప్రజాపతినిధి కుమారుడు సైతాము దాడి చేసారు అయినా వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందుకే వారు ఇంకా రెచ్చి పోతున్నారు కావున వారితో ప్రాణ హాని వుందని రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉందన్నారు. తక్షనం పోలీసులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై మండల పంచాయతీ అధికారి అరుణ్గౌడ్, సర్పంచ్ వీరభద్రంను వివరణ కోరగా సమస్య పరిష్కరించామన్నారు.