Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అయోధ్యచారి
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియాలో భూ నిర్వాసితులకు, సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో నివసించే యువతకు ఉపాధి కల్పించాలని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బొల్లోజు అయోధ్యచారి అన్నారు. గురువారం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా సింగరేణి ఓ.బి కాంట్రాక్ట్ పనులలో కొంతమంది పని చేస్తున్నరన్నారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులకు ఎక్కువ మందిని పనులలోకి తీసుకోని స్థానిక నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నరన్నారు. సింగరేణి ఓబీ టెండర్ పనులలో స్థానిక నిరుద్యోగులకు 80 శాతం తీసుకోవాల్సిందిగా గతంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నిర్ణయించడం జరిగిందన్నారు. కావున, మణుగూరు ఏరియాలో కూడా స్థానికంగా ఉన్న భూ నిర్వాసితులకు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువతకు 80 వాతం అవకాశం కల్పించాలని, ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారికి 20 వాతం కల్పించాలని ఆయన జీఎంను కోరారు. అదేవిధంగా మణగూరు ఓసీ నందు వీపీఆర్ కంపెనీ పనులు నిలిపివేసి నాలుగు నెలు కావస్తున్న, అక్కడ పనిచేసిన సుమారు 150 మంది స్థానిక కార్మికులు ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.