Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని ఆదివాసీ జేఏసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కావలసిన స్థల సేకరణ కోసం గురువారం దమ్మపేట మండల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ అధికారి, ఐటీడీఏ ఏపీఓలకు వినతి పత్రాన్ని సమర్పించారు. కమ్యూనిటి హాల్ నిర్మాణానికి అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, భద్రాచలం నగర ఆదివాసి జెఏసీ నాయకులు పూనెం వీరభద్రం, తాటి పోతురాజు, పర్సిక మారేష్, సోయం రాంమూర్తి, జివియస్పి విద్యార్థి నాయకులు మడకం ప్రసాద్, వంకా వరాల బాబూ, మడకం బాబూ అశ్వారావుపేట నియోజకవర్గ ఆదివాసి నాయకులు వాడె వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.