Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రశంసలు
కురిపించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-ఇల్లందు
అనతికాలంలోనే పట్టణ ప్రగతి, హరితహార కార్యక్రమాలలో ఇల్లందు మున్సిపాలిటీ భేష్‌గా నిలిచిందని పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 140 మున్సిపాలిటీలతో పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గురువారం హైదరాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, సీడీఎమ్ఏ అధికారులు, మున్సిపల్ మేయర్లు, చైర్మెన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కాలంలో జరిగిన అభివృద్ధి పనులు అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ భేష్ అని కొనియాడారు. ఇల్లందు మున్సిపాలిటీ తయారు చేసిన సంవత్సరకాలం ప్రగతి నివేదిక రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు తయారు చేయాలని ఆదేశించారు. ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంజన్ కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఇల్లందు మున్సిపాలిటీ తయారుచేసిన సంవత్సర కాల ప్రగతి నివేదికను స్పూర్తిగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న 140 మున్సిపాలిటీలు ఫిబ్రవరి 14 వరకు నివేదికలు తయారు చేయాలన్నారు.